‘‘పేదల పొట్టగొట్టి మాఫియాను’’…

by srinivas |
‘‘పేదల పొట్టగొట్టి మాఫియాను’’…
X

వైసీపీ ప్రభుత్వం పేదల పొట్టగొట్టి మాఫియాను మేపుతోందని టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.20,872కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు రద్దు చేసి దాదాపు 26లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేశారు. సబ్‌ప్లాన్ నిధులు, అమ్మఒడి పథకాలను దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45ఏండ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశారన్నారు. వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలిచ్చారని తెలిపారు. 8నెలల పాలనకే రూ.40వేల కోట్ల అప్పులు చేశారన్నారు.

Advertisement

Next Story