అందరిని సంతృప్తిపరచడం నా వల్ల కాదు.. అందుకే పెళ్లి చేసుకున్నా!

by Shyam |   ( Updated:2021-11-29 01:06:21.0  )
yami gautam
X

దిశ, సినిమా : నేడు 28వ బర్త్‌డే జరుపుకుంటున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన వివాహ‌బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాస్ట్ ఇయర్ ప్రముఖ దర్శకుడు నిర్మాత ఆదిత్య ధర్‌ను మ్యారేజ్ చేసుకున్న నటి, తన భర్త గురించి పలు విషయాలు వెల్లడించింది.

ఆయనది విలువలతో కూడిన వ్యక్తిత్వమని.. పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విధానం అందరినీ ఆకర్షించేలా ఉంటుందని చెప్పింది. ‘మా పెళ్లిని అంగరంగ వైభవంగా కాకుండా చాలా సింపుల్‌గా సన్నిహితుల మధ్యనే జరుపుకున్నాం. నాకు భారీ వేదికల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. మీరు చేసే పనుల నుంచే మీకు గౌరవం లభిస్తుంది. కానీ ఇతరులను మెప్పించాలంటే మన జీవితం సరిపోదు. ఏదేమైనా పెళ్లి చేసుకున్నాక సంతోషంగా ఉండాలి. ప్రస్తుతం మేం సంతోషంగానే ఉన్నాం. మా కుటుంబాలు కూడా ఆనందంగానే ఉన్నాయి. మన సాంప్రదాయాలు నాకు చాలా ముఖ్యం. ఒకవేళ కరోనా లేకపోయినా మా పెళ్లి ఇలాగే జరిగేది’ అని వివరించింది.

చిరిగిన డ్రెస్‌లో సమంత.. పిన్నీసులతో కవరింగ్.. అసలు ఏమైంది?

Advertisement

Next Story

Most Viewed