Veeranjaneya Swamy: ఆ ఇబ్బందులు ఉన్నా పింఛన్లు ఇస్తున్నాం.. మంత్రి వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Veeranjaneya Swamy: ఆ ఇబ్బందులు ఉన్నా పింఛన్లు ఇస్తున్నాం.. మంత్రి వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) లక్ష్యమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇవాళ ప్రకాశం (Prakasam) జిల్లా సుంకిరెడ్డి‌పాలెం (Sankireddypalem)లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా ప్రతి నెలా ఒకటో తారీఖున పింఛన్లను అందజేస్తున్నామని అన్నారు. నిరుపేదల కళ్లలో ఆనంద చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళలకు వెంటనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో లబ్ధిదారులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే వారి ఆరోపించారు. ఆ అభాగ్యులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఫైర్ అయ్యారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజమైన లబ్ధిదారుల ఇంటికి నేరుగా పింఛన్ చేరుతోందని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed