- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tragedy: రాష్ట్రంలో మరో విషాదం.. ఎస్సీ గురుకుల కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంటికి వెళ్లి వచ్చిన సాయివర్ధన్ కళాశాలలో రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కళాశాల సిబ్బంది సాయివర్ధన్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story