- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమంలో వెంకట్రామి రెడ్డి పాత్ర ఏంటి : యాదగిరి ఫైర్
దిశ, సిద్దిపేట : రాక్షసుణ్ణి చేర్చుకుంటున్న రాబంధుల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు పన్నులు కట్టిన డబ్బులను జీతంగా తీసుకునే ప్రభుత్వ అధికారి ప్రజలకు పని చేయకుండా కేసీఆర్‌కు జీతగాడిలాగా వ్యహరించాడని ఆరోపించారు. భూ నిర్వాసితులపట్ల రాక్షసుడిలాగా వ్యహరించి రైతుల పట్ల నియంతలా ప్రవర్తించి అన్నదాతల ఆత్మహత్యలకు కారకుడైన ఈ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిని పార్టీలో చేర్చుకుని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వెంకట్రామి రెడ్డి త్యాగం పాత్ర ఏంటని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ పదవిని ఎందుకు కట్టబెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను వరి వేయవద్దని బెదిరింపులకు పాల్పడ్డ రైతు ద్రోహికి, ప్రజావ్యతిరేకి పదవులను ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ విమర్శలు చేశారు. దొంగలకు, తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీ అడ్డాగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తప్పెట శంకర్, సిద్ధిపేట రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు భిక్షపతి, రఘు, నవీన్‌లు పాల్గొన్నారు.