- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైభవంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడి కల్యాణోత్సవం.. రెండు కిలోల బంగారం వితరణ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నుల పండువగా సాగింది. ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండు మనోహరంగా అలరించింది. అంతకు ముందు స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో మరో కిలో బంగారాన్ని వితరణగా ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాగా ఈ వేడుకకు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.