ఇండియాలో ‘రెడ్‌మీ ఇయర్ బడ్స్’ విడుదల

by Harish |
ఇండియాలో ‘రెడ్‌మీ ఇయర్ బడ్స్’ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ చైనా కంపెనీ ‘ఎమ్ఐ’ ఇటీవలే ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియోమీ కూడా ఎమ్ఐకి పోటీగా ‘రెడ్ మీ ఇయర్ బడ్స్ ఎస్’ను ఇండియాలో మంగళవారం(మే 26) లాంచ్ చేసింది. అమెజాన్ ఇండియా, ఎమ్ఐ.కామ్, ఎమ్‌ఐ హోమ్ స్టోర్స్, ఎమ్ స్టూడియో ఔట్‌లెట్స్‌లో బుధవారం (మే 27) 12 గంటలకు ఫస్ట్ సేల్ మొదలుకానుంది.

ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఇయర్ బడ్స్ ధరలన్నీ కూడా దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. రెడ్‌మీ ఇయర్ బడ్స్ ఎస్ ధర రూ. 1799గా నిర్ణయించారు. కేవలం బ్లాక్ కలర్ లోనే వీటిని జియోమీ విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే.. నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు. ప్లే బ్యాక్ టైమ్ 12 గంటల వరకు ఉంటుంది. 90 నిమిషాలు చార్జింగ్ పెడితే ఫుల్ చార్జ్ అవుతుంది. లైట్ వెయిట్‌తో పాటు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మల్టీ ఫంక్షనల్ బటన్, లో లాటెన్సీ గేమింగ్ మోడ్, బ్లూటూత్ 5.0, 7.2 ఎమ్ ఎమ్ డ్రైవర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Next Story