చైనా ఫోన్ ఔట్‌లెట్ల ముందు మేడ్ ఇన్ ఇండియా బోర్డులు

by Harish |
చైనా ఫోన్ ఔట్‌లెట్ల ముందు మేడ్ ఇన్ ఇండియా బోర్డులు
X

దిశ, సెంట్రల్ డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ జియోమీ కంపెనీ ఇండియాలో ఉన్న తమ రిటైల్ ఔట్‌లెట్ల ముందు మేడ్ ఇన్ ఇండియా లోగోలతో కొత్త బోర్డులను ఏర్పాటు చేసింది. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహాలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా వస్తువుల పట్ల పెరుగుతున్న బహిష్కరణ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ చర్యలను చేపట్టినట్టు ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. చైనా ఉత్పత్తులను నిషేధించాలని ప్రజలతో పాటు సీఏఐటీ కూడా పిలుపివ్వడంతో అసోసియేషన్ చైనాకు చెందిన బ్రాండ్లకు లేఖలు రాసింది. ఔట్‌లెట్లపై ఎలాంటి దాడులు జరగకుండా ఆయా బ్రాండ్ల పేర్లు కనబడకుండా ఇతర పేర్లతోను, ఫ్లెక్సీలతోనూ మూసేయాలని, లేదా మేడ్ ఇన్ ఇండియా బ్యానర్లను ఉంచాలని కోరినట్టు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అర్విందర్ ఖురానా స్పష్టం చేశారు.

Advertisement

Next Story