- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ చేదు జ్ఞాపకంగా.. కరోనా టాటూస్
దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారి కళ్లముందే లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్నో జీవితాలను రొడ్డున పడేయగా, మరెన్నో కుటుంబాలను చిధ్రం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడగా, ఉపాధి కరువై ఎంతోమంది ఆకలితో అలమటించారు. ప్రపంచ ఆధునిక చరిత్రలో ‘కొవిడ్ టైమ్’ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోగా.. చాలా మంది ఆ రోజులను మరచిపోవాలనే భావిస్తారు. అయితే దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం ఆ రోజులకు గుర్తుగా ‘పాండమిక్’ టాటూలు వేయించుకుంటున్నారు.
ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన మహమ్మారి పీరియడ్‌ను ఎవరూ గుర్తుంచుకోవాలనుకోరు. ఓ పీడకలలా వదిలేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు మాత్రం తమ కొవిడ్ అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడానికి టాటూ(పచ్చబొట్లు)లను వేసుకుంటున్నారు. అందులో కొంతమంది తమకు కోవిడ్ నేర్పిన పాఠాన్ని శాశ్వతం చేయడానికి పచ్చబొట్టు వేసుకుంటే. మరికొందరు మహమ్మారిని ఎదుర్కొని సజీవంగా నిలిచిన పోరాటపటిమకు నిదర్శనంగా టాటూ వేసుకుంటున్నారు. అలాగే ప్రపంచమంతా కరోనాను ఓడించలేక ఓటమిలో కూరుకుపోయినప్పుడు, తాము మాత్రం గెలుపు బాటలో పయనించామనేందుకు సాక్ష్యంగా టాటూ నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ, తమ తమ విజయాలకు, ధైర్యానికి ప్రతీకలుగా టాటూలు నిలుస్తున్నాయి.
న్యూయార్క్‌లోని కాక్స్‌సాకీలో నివసిస్తున్న రాచెల్ సన్‌షైన్‌కు డీజనరేటివ్ నెర్వ్ డిసీజ్ ఉంది. అయితే ఈ వ్యాధి ఉన్నవారు వైరస్ బారిన పడితే చనిపోయే ప్రమాదం ఎక్కువ. అలాంటిది విధికి ఎదురెళ్లిన ఆమె కొవిడ్‌ను రెండుసార్లు జయించడం విశేషం. అంతేకాదు మహమ్మారి ఆమె గుండెను కూడా దెబ్బతీసిప్పటికీ ఆపరేషన్ ద్వారా బతికి బయటపడింది. ఇక కొవిడ్ టైమ్‌లో మొత్తంగా ఏడుసార్లు ఆసుప్రతిలో చేరిన రాచెల్.. తన 44వ పుట్టినరోజు(మే 26, 2021)న మసాచుసెట్స్‌లోని టాటూ సెంటర్‌లో ‘గుండెను చుట్టుముట్టిన కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్స్’ డిజైన్‌ను టాటూగా వేయించుకుంది.
‘టాటూ ఆర్టిస్ట్‌తో మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని వివరించాను. నా ప్రయాణంలో నా కథలో భాగమైన అతడు అద్భుతమైన డిజైన్ అందించాడు. దాన్ని చూస్తే కన్నీళ్ళు వచ్చాయి’ అని సన్‌షైన్ తెలిపింది. ఇక కరోనా సమయంలో ‘టాయిలెట్ పేపర్’ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీన్ని ప్రతిబింబించేలా ఓ మహిళా టాయిలెట్ పేపర్‌ను టాటూగా వేయించుకుంది. ఏ విషయంలోనైనా పాజిటివ్, నెగటివ్ ఉంటుంది. కరోనా విషయంలోనూ అంతే. దానికి సాక్ష్యమే ఈ ‘పాండమిక్ టాటూ’లు.