భగీరథ నీళ్ళలో తోక పురుగులు

by Shyam |
Mission Bhagiratha Water
X

దిశ ప్రతినిధి, మెదక్: ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమం అబాసుపాలవుతోంది. బాలవికాస వాటర్ కంటే మిషన్ భగీరథ వాటర్లోనే స్వచ్చదనం ఎక్కువ, అన్ని రకాల మినరల్స్ ఇందులో వుంటాయని, ప్రతిఒక్కరూ ఈ నీటినే తాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. కానీ అది ఎవరి నిర్లక్ష్యమో తెలీదు గానీ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిలో తోక పురుగులు, చెత్తాచెదారం ఎక్కువగా వస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేయడం లేదు. కనీసం వాటర్ ట్యాంక్‌లను సరిగా శుభ్రం చేయడం లేదు. దీంతో చాలా గ్రామాల్లో ఆ నీటిని తాగు నీటి అవసరాలకు ఉపయోగించకుండా బట్టలు పిండేందుకు, స్నానాలకు, మరుగుదొడ్లకు ఉపయోగించుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్‌లలో ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో ఆ నీటిని తాగలేక పోతున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మిషన్ భగీరథ వాటర్ నిబంధనల మేరకు ఫిల్టర్ చేసి పంపాలని కోరుతున్నారు.

Advertisement

Next Story