ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా ఉదయ్ కోటక్!

by Harish |
ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా ఉదయ్ కోటక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కోటక్ బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..ఉదయ్ కోటక్ సంపద సుమారు రూ. 1.18 లక్ష కోట్లకు చేరుకోవడంతో ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా నిలిచారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి, ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 17 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బ్యాంకు సీఈవోగా ఉదయ్ కోటక్‌ను అదనంగా మరో మూడేళ్లు పొడిగిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది.

సాధారణంగా బ్యాంకులకు రుణాలు ఎగవేతలు ప్రధాన సమస్యగా ఉంటాయి. దీనివల్ల బ్యాంకుల పనితీరుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కోటక్ బ్యాంక్ చిన్న, మధ్య తరహా కంపెనీలకు, సురక్షితం కాని వ్యక్తులకు రుణాలను ఇవ్వడాన్ని తగ్గించింది. ఈ నిర్ణయాలతో బ్యాంకు మూడేళ్ల కాలంలో షేర్ ధర 24 శాతం పుజుకుంది. అదేవిధంగా ఈ ఏడాది మొండి బకాయిల విషయంలో బ్యాంకు రెండో అత్యుత్తమ బ్యాంకుగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కోటక్ సంపద పెరగడంతో సంపన్న బ్యాంకర్‌గా నిలిచారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed