World War 3: ‘మరో 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ విధ్వంసం తప్పదు..’

by Indraja |   ( Updated:2024-06-16 13:08:02.0  )
World War 3: ‘మరో 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ విధ్వంసం తప్పదు..’
X

దిశ వెబ్ డెస్క్: ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆ సమయంలో అన్ని దేశాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనంపై ఆ యుద్ధాలు త్రీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాని నుండి కోలుకోవడానికి శతాబ్ధాల కాలం పట్టింది. కాగా ప్రస్తుతం ప్రపంచం అన్నిరంగాలలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.

ఈ సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అన్ని దేశాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆస్థి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. సాధారణ యుద్ధాల్లో అణుబాంబులు ఉపయోగించకూడదని ప్రపంచ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం ఆ ఒప్పందాన్ని అతిక్రమించే అవకాశం ఉంది.

ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసిన దేశాలు ముచ్చటగా మూడవ సారి సైతం ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతాయా అంటే.. అవును అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్. ‘మరో 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం జరగనుంది. ఖగోళంలోని అత్యంత బలమైన గ్రహాల మధ్య సంఘర్షణ జరగనుంది. దీని కారణంగా 18వ తేదీన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది.

కాగా ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసాన్నే సృష్టించబోతోంది. ప్రస్తుతం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న చైనా-తైవాన్, ఉత్తర కొరియా-దక్షిణ కొరియా, ఉక్రెయిన్-రష్యా, మిడిల్ ఈస్ట్‌లలో ఉద్రిక్తతలు మరింత పెరుగే అవకాశం ఉంది’ అని ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధాని సంకేతాలని తెలిపారు. ‘అలానే రాబోయే 48 గంటలు ఎంతో క్లిష్టమైనవి. ఎందుకంటే నింగి నుంచి ఉపగ్రహాలు నేలకి దూసుకొస్తాయి.

దీనికారణంగా అడవులు భగ్గున మండి బూడిదగా మారుతాయి. అలానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడతాయి. ప్రపంచాన్ని ఈ యుద్ధం సర్వనాశనం చేస్తోంది’ అని కుశాల్ కుమార్ వెల్లడించారు. కాగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి గత నెలలోనే ఆయన అంచానా వేశారు. ఈ నేపథ్యంలో ఆయన మే నెలలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సైతం మాట్లాడారు. అలానే భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ఉగ్రదాడులు జరుగుతాయని, కనుక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అసలు ఎవరీ కుశాల్ కుమార్?.. ఆయన అంచనాలు నిజమవుతాయా..?

కుశాల్ కుమార్ హర్యానాకు చెందిన వ్యక్తి. ఆయన హర్యానాలోని పంచకుల సెక్టార్ 20లో నివసిస్తుంటారు. కాగా ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకుని ‘న్యూ నోస్ట్రాడమస్‌’గా పేరుగాంచారు. ‘ఆయన మ్యాప్ ఆఫ్ అవర్ కర్మ అని నమ్మే వేద జ్యోతిషశాస్త్ర చార్ట్‌ను’ అనుసరించి ముఖ్యమైన ప్రపంచ సంఘటనలను అంచనా వేస్తుంటారు.

గతంలో ఈ చార్ట్‌ను ఉపయోగించి ఇజ్రాయెల్-హమాస్, చైనా-తైవాన్, రష్యా-నాటో మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అంచనా వేశారు. కాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. మరీ 48 గంటల్లో ప్రపంచ యుద్ధం మొదలుకానుందన్న ఆయన అంచనా నిజమవుతుందా..? లేదా..? అనే విషయం తెలియాలంటే మరో 48 గంటలు వేచి చూడాల్సిందే.

న్యూ నోస్ట్రాడమస్‌ ఎవరు?

నోస్ట్రాడమస్ అనే వ్యక్తి ఓ జ్యోతిష్కుడు. కాగా ఈయన 1503 డిసెంబర్‌లో ఫ్రెంచ్‌‌లో జన్మించారు. ఇక ఆయన రాసిన ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకంతో ప్రసిద్ధికెక్కారు. ఈ పుస్తకంలో 942 పద్యాలు ఉంటాయి. వాటిని ప్రవచనాలుగా. ఆయన ముందుగానే అంచనా వేసిన కొన్నిసంఘటనలు నిజమయ్యాయని ఆయన ఫాలోవర్స్ నమ్ముతారు.

ఫ్రెంచ్ విప్లవం,గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్,నెపోలియన్ - అడాల్ఫ్ హిట్లర్‌ల ఎదుగుదల, మొదటి - రెండవ ప్రపంచ యుద్ధాలు, హిరోషిమా-నాగసాకి అణు విధ్వంసం మొదలైనవి ఆయన ముందుగానే అంచనా వేశారని, ఆయన చెప్పినట్టే అవన్నీ జరిగాయని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed