మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి : Donald Trump

by Y. Venkata Narasimha Reddy |
మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి : Donald Trump
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 400 క్షిపణులతో దాడులు చేసిన ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత పెరిగిపోయింది. ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇద్దరు చిన్నపిల్లలు పాఠశాల ప్రాంగణంలో కొట్లాడుకుంటున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ' ఈ యుద్ధ ప్రక్రియను ముగించాలని, ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము గమనిస్తున్నామని, ఇది భయంకరమైన యుద్ధమని, ప్రతిఒక్కరూ జీవించాలన్నదే మా అభిమతమన్నారు. పశ్చిమాసియాలో జరిగే ఇలాంటి సంఘటనలపై అమెరికా మరింత లోతుగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలంగా నేను ముడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నానని, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఎలాంటి యుద్ధాలు జరగలేదని, ప్రస్తుత అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు అసమర్థులని, వాళ్లే యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.

Next Story

Most Viewed