విషపు చేపలు తిని మహిళ మృతి.. భర్త పరిస్థితి విషమం

by S Gopi |   ( Updated:2023-04-03 14:38:48.0  )
విషపు చేపలు తిని మహిళ మృతి.. భర్త పరిస్థితి విషమం
X

కౌలాలంపూర్: మలేషియాలో దారుణం చోటుచేసుకుంది. విషపూరిత చేపను తిని మహిళ మరణించగా ఆమె భర్త చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నాడు. గత నెలలో స్థానిక షాపు నుంచి పఫర్ చేపలను ఈ జంట కొనుగోలు చేసినట్లు వారి కూతురు వెల్లడించింది. తరుచుగా కొనుగోలు చేసే వారి దగ్గర నుంచే తీసుకోగా, అవి విషపు చేపలని గుర్తించలేకపోయారని అంగ్ అలీ పేర్కొంది. ఈ క్రమంలో ఆహారంగా తీసుకోగా తల్లి మరణించగా, తండ్రి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు చెప్పింది. ఆహారం విషతుల్యం కావడం వల్లే మరణం సంభవించినట్లు వైద్యులు వెల్లడించారని తెలిపింది. ఆహారం తీసుకున్న వెంటనే మహిళ ఆరోగ్యం దెబ్బతిందని, ఆమె భర్తకు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించగా మహిళ మరణించగా, ఆమె భర్త కోమాలో ఉన్నారు.

Also Read..

సూర్యుడిపై మాసివ్ హోల్.. భూమివైపు సౌర తుఫానులు వచ్చే అవకాశం!

Advertisement

Next Story