అమెరికా తప్పుకుంటే ఎవరు నాయకత్వం వహిస్తారు?: ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన బైడెన్

by samatah |
అమెరికా తప్పుకుంటే ఎవరు నాయకత్వం వహిస్తారు?: ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ నాయకత్వంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు. ప్రపంచ వేదికలపై నుంచి యూఎస్ తప్పుకుంటే ప్రపంచాన్ని ఎవరు నడిస్తారని ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని టంపాలోని హిల్స్‌బరో కమ్యూనిటీ కాలేజీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూఎస్ తరఫున ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు హాజరయ్యానని చెప్పారు. జీ7, జీ20తో పాటు అనేక సదస్సుల్లో ఇతర దేశాధినేతలతో వేదికను పంచుకున్నానని తెలిపారు.

ప్రతి సమావేశంలో తనను కలవడానికి వివిధ దేశాధినేతలు పోటీ పడతారని తెలిపారు. ఎందుకంటే అమెరికా వ్యవహారశైలి ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పారు. ప్రపంచంలో జరిగే ప్రతి వ్యవహారం విషయంలో అమెరికా స్పందన గురించి ఎదురు చూస్తుంటారని నొక్కి చెప్పారు. ఇటీవల బైడెన్ చేసిన వ్యాఖ్యలు సరికావని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో జరగబోయే ఎన్నికలను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో గమనిస్తోందని చెప్పారు. ఇటీవలి సర్వేల్లో ట్రంప్ కంటే తానే ముందంజలో ఉన్నానని బైడెన్ చెప్పారు. ఇప్పటి వరకు తన ప్రచారం అద్బుతంగా ఉందని దాదాపు అర బిలియన్ యుఎస్‌డీని సేకరించినట్లు చెప్పారు.

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరిగే ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్‌లు గెలుపొందారు. తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. గతంలోనూ వీరిద్దరూ పోటీ పడగా బైడెన్ గెలుపొందారు. దీంతో యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్, బైడెన్‌లు ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. 2020లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన రాష్ట్రాల్లో గెలవాలని బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Next Story