వీల్‌చైర్ బౌండ్‌ ప్ర‌పంచ బ‌ల‌మైన‌ విక‌లాంగుడిగా రికార్డ్‌... ఇంత‌కీ ఏం చేస్తున్నాడు?! (వీడియో)

by Sumithra |   ( Updated:2022-03-17 08:25:47.0  )
వీల్‌చైర్ బౌండ్‌ ప్ర‌పంచ బ‌ల‌మైన‌ విక‌లాంగుడిగా రికార్డ్‌... ఇంత‌కీ ఏం చేస్తున్నాడు?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది', 'మ‌నో బ‌ల‌మే అన్నింటిక‌న్నా గొప్ప శ‌క్తి...' ఇలాంటి స్ఫూర్తివంత‌మైన మాట‌లు మ‌న‌లో ఉత్సాహాన్ని క‌లింగించొచ్చు. అయితే, వాటిని ఆక‌ళింపు చేసుకొని, ఆచ‌రించే వాళ్లు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. వాళ్లు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా అనుకున్న‌ది సాధించి తీరుతారు. దానికి ఒక‌ ఉదాహ‌ర‌ణే డేవిడ్ వాల్ష్‌. జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమిత‌మైన ఈ వ్య‌క్తి

10-టన్నులున్న రెండు ట్రక్కులను ఒంటరిగా లాగాడు. దీనికి కార‌ణం ప్రపంచంలోనే బలమైన వికలాంగుడిగా మారాల‌నే అత‌ని సంక‌ల్ప‌మే! 2016లో ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన ముగ్గురు పిల్ల‌ల తండ్రి డేవిడ్ వాల్ష్‌ శ‌క్తివంతుడిగా కావ‌డాన్నే జీవన విధానంగా మార్చుకున్నాడు. డేవిడ్ వాల్ష్‌కు 2021లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న‌ట్లు తెలిసింది. అయినా, అత‌ని ఆశ‌యం మాత్రం స‌న్న‌గిల్ల‌లేదు. ఐదేళ్ల తర్వాత, అతను స్ట్రాంగ్‌మ్యాన్ పోటీల్లో పాల్గొనడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈ మ‌ధ్య‌లో ఎన్నో స‌వాళ్లు. కానీ, అంత‌కుమించిన సాధ‌న అత‌న్ని మ‌రింత బ‌లంగా మార్చింది.

డేవిడ్ ఇంత‌కుముందు కూడా స్ట్రాంగ్‌మ్యాన్ పోటీల్లో పాల్గొన్నాడు. త‌న‌ మొదటి 'డిసేబుల్డ్ స్ట్రాంగ్‌మ్యాన్ పోటీలో ద‌క్షిణ ఇంగ్లండ్‌లో బలమైన వికలాంగుడిగా నిలిచాడు. అలాగే బ్రిటన్ స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా మూడవ స్థానంలో నిలిచాడు. 2020లో, అతను వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ డిసేబుల్డ్ మ్యాన్‌లో పోటీపడి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక ఈ సంవత్సరం, అగ్రస్థానంలో నిల‌వ‌డానికి ఈ ట్ర‌క్ లాగే ఫీట్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశాడు. నిజానికి, వ‌రల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా మారాల‌నే క‌లే అత‌న్ని విక‌లాంగుడిగా మార్చింది. 2014లో ట్రైనింగ్‌లో ఉన్న‌ప్పుడు త‌న కుడి చేయి మొద్దుబారింది. ఆ తిమ్మిరి అతని శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపించి, చివ‌రికి వీల్‌చైర్‌లో మిగిలాడు. అయినా, సంక‌ల్పం మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అంత‌కుమించి మ‌రింత ప‌దునుగా మారింది.

Advertisement

Next Story