రెండో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా

by Javid Pasha |   ( Updated:2023-02-20 11:07:30.0  )
రెండో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
X

ప్యాంగ్యాంగ్: యూఎస్-దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తరకొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సోమవారం మరోసారి బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. 48 గంటల వ్యవధిలోనే ఇది రెండో ప్రయోగమని చెప్పారు. తూర్పు సముద్రం వైపు ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా ఆర్మీ అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ జపాన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

ఉత్తరకొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి 66 నిమిషాల పాటు ప్రయాణించి ప్రత్యేక ఆర్థిక మండలిలో ల్యాండ్ అయిందని జపాన్ తెలిపింది. మరోవైపు కిమ్ జాంగ్ ఉన్ కార్యాలయం యూఎస్ కు తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా కార్యకలాపాలపైనే పసిఫిక్ ను ఫైరింగ్ రేంజ్ గా ఏ మేరకు ఉపయోగించాలనేది ఆధారపడుతుందని ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed