దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మూడో ర్యాంక్

by srinivas |
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మూడో ర్యాంక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ ర్యాంకింగ్ (డియూఆర్​) రిపోర్ట్ - కన్జుమర్​సర్వీస్​రేటింగ్​ఆఫ్​డిస్కం స్​రిపోర్ట్​ 2023 -24 లో కేటగిరీ పరంగా మూడోవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కేటగిరిలో మొత్తం 41 విద్యుత్ పంపిణి సంస్థలకు ర్యాంకులు కేటాయించగా , టీజీ ఎస్​పిడిసిఎల్​కు 3వ స్థానం రావడం విశేషం. దక్షిణ డిస్కం తన పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తో పాటు, ఇతర డిస్కం లతో పోల్చుకుంటే అతి తక్కువ సమయంలో విద్యుత్ కనెక్షన్ ల మంజూరు, అతి కొద్ది పత్రాలతో వివిధ సేవలు పొందేలా నియమ నిబంధలను సరళతరం చేయడం, ఖచ్చితమైన బిల్లింగ్, సరైన మీటరింగ్ కోసం ఐఆర్​ పోర్ట్ ఆధారిత మీటర్లను అమర్చడం, వినియోగదారుల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించడం, విద్యుత్ కార్యాలయాలను సందర్శించకుండానే నేరుగా ఆన్​లైన్​ లోనే సంస్థ వెబ్ సైట్ , మొబైల్ ఆప్ ను సందర్శించి దాదాపు 99 శాతం విద్యుత్ సంబంధిత సేవలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ మొచ్చుకుంది. ఈ గుర్తింపు రావడం పట్ల టీజీఎస్​పిడిసిఎల్​సీఎండి ముషారఫ్ ఫరూఖీ తమ వినియోగదారులకు, అధికారులకు, సిబ్బందికి అభినందలు తెలిపారు. భవిష్యత్ లోను సంస్థను మరింత వున్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని సూచించారు.

Next Story