- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
USA: అమెరికాలో ఘోరం.. నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపినా భారత సంతతి వ్యక్తి
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన నేపాల్‌కు చెందిన మున పాండే అనే 21 ఏళ్ల విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు కాల్చిచంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.కాగా మున పాండే హూస్టన్‌లోని కమ్యూనిటీ కళాశాలలో చదువుతోంది. ఆమె చదువుతున్న కాలేజీకి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె అపార్ట్‌మెంట్‌లోకి దోపిడీకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు 52 ఏళ్ల బాబీ సిన్ షాగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లో ఓ మృతదేహం గురించి తమకు అనుమానాస్పద కాల్ వచ్చిందని ఆమె అపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మున పాండే 2021లో నేపాల్ నుంచి అమెరికాలోని హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లింది. మున పాండే చనిపోవడానికంటే ముందు ఆమె తల్లి ఆమెను సంప్రదించేందుకు చాలా సార్లు ప్రయత్నించినా ఆమె ఫోన్‌లోకి అందుబాటులోకి రాలేదు. పాండేపై మూడు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మంచం మీదే ఆమె పడి ఉంది. దర్యాప్తులో నిజం తెలుస్తుందని నేపాల్ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే మున పాండే తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోవడంతో ఆమె పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు . పాండే తల్లి హూస్టన్‌కు వెళ్ళడానికి సహాయం చేసేందుకు అసోసియేషన్ నేపాల్ కాన్సులేట్‌తో సంప్రదింపులు చేస్తోంది. మున పాండే కోసం నేపాల్ అసోసియేషన్ GoFundMe పేరుతో ఫండ్ కలెక్ట్ చేస్తోంది. వచ్చిన మొత్తాన్ని పాండే అంత్యక్రియలకు.. ఇతర ఖర్చులకు అందజేయనున్నారు. ఇప్పటికే అసోసియేషన్ దాదాపు 30 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. పాండే తల్లి.. అమెరికా చేరుకోగానే ఈ డబ్బును ఆమెకు అందజేయనున్నారు.