హూతీల డ్రోన్లను ధ్వంసం చేసిన అమెరికా దళాలు

by Disha Web Desk 17 |
హూతీల డ్రోన్లను ధ్వంసం చేసిన అమెరికా దళాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్ తీరంలో హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు డ్రోన్లను అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూల్చివేసినట్లు శుక్రవారం ప్రకటించారు. ఇరాన్-మద్దతుగల హుతీ బృందం బుధవారం నుంచి వరుసగా దాడులు చేస్తూనే ఉందని అధికారులు తెలిపారు. బుధవారం మొదటగా నాలుగు డ్రోన్‌లను ప్రయోగించగా, వాటిని యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి. గురువారం కూడా గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని లైబీరియా-ఫ్లాగ్డ్ కార్గో షిప్ లక్ష్యంగా చేసుకుని హుతీ బృందం క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో షిప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై హుతీ మిలటరీ ప్రతినిధి యాహ్యా సారీ గురువారం X లో వ్యాఖ్యానిస్తూ, మా ఆపరేషన్‌లో లక్ష్యాలను విజయవంతంగా సాధించాము అని అన్నారు.

యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించే హుతీలు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి షిప్‌లపై ఎక్కువగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడులు పెరగడం వలన అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు హూతీ తిరుగుబాటుదారులపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఎర్ర సముద్ర తీరంలో రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో నౌకలపై దాడులను ఎదుర్కోవడానికి పశ్చిమ నావికా దళాలను మోహరించారు.



Next Story

Most Viewed