- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sky Fish: ఇరాన్‌లో చేపల వర్షం! రోడ్లపై చేపలు పడుతున్న వాహనదారులు..
దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడైనా ఆకాశం నుంచి వర్షంతో పాటు చేపలు కూడా పడటం చూశారా? అయితే, ఇరాన్ వాసులకు మాత్రం ఈ అనుభవం ఎదురైంది. ఇరాన్‌లో తాజాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరాన్‌లోని యాసుజ్ ప్రాంతంలో వర్షంతో పాటు చేపలు కూడా పడుతున్నాయి. అక్కడి ప్రాంతం వారు మొదట ఇది చూసి షాక్ అయ్యారు. తర్వాత రోడ్లపైకి వచ్చి చేపలు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. దీనిని ప్రకృతి అద్భుతం అని పిలుస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ఇలా జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయం చెబుతున్నారు.
ఇప్పుడు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆకాశం వైపు చూడాల్సిందేనని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో కూడా ఈ విధంగా వర్షం కురిస్తే బాగుండేదని, ఫ్రీగా చేపలు పట్టుకునే వాళ్లమని ఫిష్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ తరహా చేపల వర్షాలు ఇంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో కురిశాయి. సముద్రాలు, నదులు, చెరువులు ఉన్న ప్రదేశాల్లో సుడి గాలులు వచ్చినప్పుడు అవి చేపలను పైకి పోతాయి.. మేఘాలతో పాటు ఆకాశంలో కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. తర్వాత భూమిపై వర్షంతో పాటు చేపలు కూడా పడుతాయని నిపుణులు చెబుతున్నారు.