ఆ రాముడినే తీసుకొచ్చిన మహానుభావుడు.. ప్రధాని మోడీపై పవన్ ప్రశంసలు

by Disha Web Desk 16 |
ఆ రాముడినే తీసుకొచ్చిన మహానుభావుడు.. ప్రధాని మోడీపై పవన్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. రాజమండ్రి వేమగిరిలో కూటమి తరపున నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అయోధ్యకు రాముడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ శక్తి ఏంటో చూపించారని కొనియాడారు. దేశాభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా అవసరమేనని చెప్పారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. భారత్ వైపు చూడాలంటే పదేళ్లుగా శత్రువులు భయపడిపోతున్నారని చెప్పారు. మోడీ ఒక్క పిలుపుతో దేశంలోని ప్రతి అణువు కదిలి వస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో వేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర ఇస్తున్న కొన్ని పథకాలను సీఎం జగన్ సరిగా వినియోగించుకోలేకపోయారని పవన్ మండిపడ్డారు.

కేంద్రప్రథకాలకు వైఎస్సార్, జగన్ పేర్లు పెట్టుకున్నారని పవన్ ఎద్దేవా చేశారు. కేంద్ర ఇచ్చిన ఇళ్లకు కూడా జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. దేశానికి జాతీయ జెండాను అందించిన నేల మనదని అని చెప్పారు. జగన్ 59 నెలల పాలనలో అన్ని స్కాములేనని విమర్శించారు. ఈ సమాజంలో అణువనువుగా దేశ భక్తి ఉందని చెప్పారు. మోడీ వికసిత్ భారత్ కార్యక్రమంలో తామూ భాగస్వాములు అవుతామన్నారు. మోడీ అధికారంలో ఉండటవల్లే అసలైన అర్హులకు పద్మ అవార్డులు వచ్చాయని పవన్ తెలిపారు. అసలైన కాళాకరులనే మోడీ పురస్కరించారన్నారు. ఐదో కోట్ల మంది ప్రజలను వేధించారు. ఏపీలో అమృత ఘడియలు రావాలని పవన్ ఆకాంక్షించారు.

Next Story

Most Viewed