ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన అమెరికా అధ్యక్షుడు

by Javid Pasha |   ( Updated:2023-02-20 16:26:00.0  )
ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన అమెరికా అధ్యక్షుడు
X

కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు షాక్ ఇచ్చారు. ఆకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమయ్యారు. సోమవారం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ మేరకు బైడెన్ పర్యటనను ఉద్దేశించి వైట్ హౌజ్ ప్రకటన విడుదల చేసింది. 'ఉక్రెయిన్‌పై రష్యా క్రూరమైన దండయాత్రకు ఒక సంవత్సరం పూర్తి కానుంది.

ఈ నేపథ్యంలో జెలెన్ స్కీతో సమావేశమయ్యాను. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల మా మద్దతును పునరుద్ఘాటించాను' అని పేర్కొంది. పుతిన్ దాడి ప్రారంభించిన సమయంలో ఉక్రెయిన్ బలహీనమని, పశ్చిమ దేశాలు విడిపోయాయని భావించాడనని తెలిపింది. మమ్మల్ని సులభంగా ఓడిద్దామనుకున్నా అది పూర్తి తప్పదమని తేలిందని వెల్లడించింది. ఈ వారంలో మరిన్ని అదనపు ఆంక్షలు విధిస్తామని బైడెన్ తెలిపారు.

ఏడాది కాలంగా యూఎస్ అపూర్వమైన సైనిక, ఆర్థిక, మానవతా మద్దతుతో ఉక్రెయిన్‌ను రక్షించడంలో సహాయపడటానికి అట్లాంటిక్ నుండి పసిఫిక్ వరకు దేశాల కూటమిని నిర్మించిందని బైడెన్ అధ్యక్ష భవనం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 24తో రష్యా ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ అపరేషన్ ను ప్రారంభించి ఏడాది పూర్తి కానుంది.


Advertisement

Next Story

Most Viewed