అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్ అరెస్ట్

by srinivas |   ( Updated:2023-12-18 14:20:48.0  )
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్ అరెస్ట్
X

వాషింగ్టన్ : ఓ దుండగుడు కారును వేగంగా డ్రైవ్ చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా మరో వాహనాన్ని కూడా ఢీకొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం రాత్రి 8.09 గంటలకు అమెరికాలోని డెలావర్‌లో ఉన్న విల్మింగ్టన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనతో కలకలం రేగింది. ఇది జరిగినప్పుడు బైడెన్ కాన్వాయ్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది. అక్కడే ఉన్న ఓ భవనంలో అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులతో భేటీ అయిన బైడెన్ దంపతులు.. సరిగ్గా బయటికి వస్తున్న టైంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆ సమయంలో దుండగుడి కారుకు, బైడెన్‌ నిలబడిన చోటుకు మధ్య గ్యాప్ 130 అడుగులే. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ దంపతులను హుటాహుటిన వైట్‌హౌస్‌కు తరలించారు. వారిద్దరు క్షేమంగానే ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించాయి. ఇక సదరు కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Next Story