యెమన్‌లో అమెరికా, బ్రిటన్ దాడులు: 36 హౌతీ స్థావరాలపై అటాక్

by samatah |
యెమన్‌లో అమెరికా, బ్రిటన్ దాడులు: 36 హౌతీ స్థావరాలపై అటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, బ్రిటన్ బలగాలు కలిసి మరోసారి యెమన్‌పై దాడి చేశాయి. యెమన్‌లోని 13 ప్రదేశాల్లో 36హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలే టార్గెట్‌గా అటాక్‌కు పాల్పడ్డాయి. వీటిలో హౌతీలకు చెందిన ఆయుధాల నిల్వ, క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు వంటి వాటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు యూఎస్ సైనికులను చంపినందుకు ప్రతిస్పందనగా ఇరాక్, సిరియాలో ఇరాన్ మద్దతుగల లక్ష్యాలపై అమెరికా వైమాణిక దాడులు చేసిన నేపథ్యంలోనే ఉమ్మడి అటాక్ జరగడం గమనార్హం. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు గాజాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలపై అమెరికా, బ్రిటన్‌లు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఇది మూడో జాయింట్ ఆపరేషన్. గతంలో జనవరి 11, 28 తేదీల్లో సంయుక్తంగా యెమన్‌పై దాడి చేశాయి.

హౌతీలను నియంత్రించాలి: యూఎస్, యూకే

యెమన్‌పై దాడుల అనంతరం అమెరికా, బ్రిటన్‌లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హౌతీ తిరుగుబాటుదారులను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ‘ఎర్రసముద్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నౌకలు దిగుమతి ఎగుమతులు చేస్తాయి. ప్రపంచంలోని 12శాతం రవాణా ఈ మార్గంలోనే జరుగుతుంది. హౌతీల దాడుల కారణంగా యూరప్, ఆసియా మధ్య ప్రధాన మార్గంలో వాణిజ్యం దెబ్బతింది. కాబట్టి హౌతీలను అంతం చేయడం ఎంతో అవసరం’ అని తెలిపారు. మరోవైపు యెమన్‌పై ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ దళాలు కూడా దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story