- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న సైనిక జంట! 20 ఏళ్ల ప్రేమ ఫలించింది!!
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌లో యుద్ధంతో వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది ఇళ్లు విడిచి, పారిపోయారు. మరో మార్గం లేక అక్కడే ఉండిపోయినోళ్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఈ భయాందోళనల మధ్య ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనిక జంట వివాహం చేసుకోవాలనుకున్నారు. మిలటరీ దుస్తులు ధరించి, తోటి సైనికుల సంగీత వాయ్యిద్యాల నడుమ, బాంబుల మోతలో దద్దరిల్లుతున్న యుద్ధభూమిలో ఒకటయ్యారు. సోషల్ మీడియాలో ఈ వివాహ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
లెస్యా, వాలెరీ అనే ఉక్రెయిన్ సోల్జర్స్ తీవ్రమైన యుద్ధం మధ్యలో కలకాలం జీవిద్దామని వాగ్ధానం చేసుకొని, కలసిన విచిత్రమైన సంఘటన ఇది. కీవ్ సమీపంలో జరిగిన ఈ వివాహంలో సోల్జర్ హెల్మెట్‌కు బదులుగా తలపై తెల్లని వీల్ ధరించిన పెళ్లి కూతురు లెస్యా చేతిలో పూల బొకేతో... ఆమె చెయ్యి పట్టుకొని పెళ్లికొడుకు వాలెరీ పెళ్లి పాటను పాడారు. వధూవరుల చేతుల్లో షాంపైన్ ఫ్లూట్ గ్లాసెస్... ఆర్మీ డ్రస్ ధరించిన లెస్యా, వాలెరీల చుట్టూ సైనిక సహచరులు ఉక్రెయిన్ సంస్కృతిని ప్రతిబింబిచే రాగాలు పాడుతుండగా, ఒక సోల్జర్ ఉక్రెయిన్ సాంప్రదాయ సంగీత వాయిద్యంపై ట్యూన్లు వాయిస్తూ వివాహంలో తమ సమ్మతిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు వాలెరీ చేతులు పట్టుకుని కనిపించింది.
ఈ వీడియోను మొదట జర్మన్ న్యూస్ అవుట్లెట్ బిల్డ్ రిపోర్టర్ పాల్ రాన్జీమర్ షేర్ చేశారు. దారుణమైన యుద్ధభూమిలో జరిగిన వివాహం చూసి నెటిజన్లు బాధ, ఆనందం కలగలిసిన భావోద్వేగంతో స్పందిస్తున్నారు. 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు 18 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ఈ యుద్ధం నేపథ్యంలో వీళ్లు వివాహం చేసుకోడానికి నిశ్చయించుకున్నారు.
Volunteers from one of the 112th Battalions of the Kyiv Special Troop Brigade got married.
Lesya and Valeriy have been together for twenty years and have an 18-year-old daughter, but they still haven't had time to get married. #Ukraine pic.twitter.com/R9ms9WhpUT
— Ukraine Update 🇺🇦 (@Ukrain_War) March 6, 2022