- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వార్-3 అంచున అమెరికా.. ఈ పాపం బైడెన్‌దే: ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో : అధ్యక్షుడు జో బైడెన్ పాలనా వ్యైఫల్యం వల్లే అమెరికా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడాల్సి వచ్చిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటి బలహీన విదేశాంగ విధానాలను అనుసరించేవాడిని కాదన్నారు. ఆదివారం రోజు జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు జరిపిన డ్రోన్ దాడిలో పలువురు అమెరికా సైనికులు చనిపోగా, డజన్ల కొద్దీ సైనికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్.. తన హయాంలో ఎన్నడూ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఈవిధమైన దాడులు జరగలేదన్నారు. ఇరాన్‌పై పూర్తిస్థాయిలో ఒత్తిడిని పెంచే విదేశాంగ విధానాన్ని విడనాడిన బైడెన్.. ఆ దేశానికి స్వయంగా నిధులను సమకూర్చి మరింత బలోపేతం చేశారని ట్రంప్ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 తరహా దాడులు చేసేందుకు హమాస్ సాహసించేది కాదన్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధమనే ప్రస్తావనే లేకుండా తాను చేసేవాడినని తెలిపారు.