టిక్‌టాక్‌లో క్రాప్ టాప్ వేసుకుంద‌ని సొంత అన్న‌ ఇలా చేశాడు..!

by Sumithra |
టిక్‌టాక్‌లో క్రాప్ టాప్ వేసుకుంద‌ని సొంత అన్న‌ ఇలా చేశాడు..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః టిక్‌టాక్ స్టార్ ఇరాఖీ కుర్దిస్థాన్‌కు వేల‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మారి, మరియా అనే పేర్ల‌తో సుప‌రిచితురాలైన‌ ఎమాన్ సమీ మగ్దిద్ ఇప్పుడు హ‌త్య‌కు గుర‌య్యింది. ప్ర‌పంచ మాన‌వుడంటూ కాల‌ర్ ఎగ‌రేసుకు బ‌తుకుతున్న ఈ ఆధునికి మాన‌వుడు మైండ్ నిండా స‌నాత‌న ఆలోచ‌న‌లే నింపుకొని, మ‌త‌వాదంలో మాన‌వ‌త్వాన్ని మ‌రిచిపోతున్నాడన‌డానికి ఈమె హ‌త్యే కార‌ణం. 17 ఏళ్ల మ‌రియా సోదరుడు ఇటీవ‌ల ఓ రాత్రి ఎర్బిల్ నగరంలోని ఒక రోడ్డుపైన త‌న సొంత సోద‌రి దేహంలో తొమ్మిది బుల్లెట్లను దింపాడు. ఇదంతా కేవ‌లం ఆమె ఒక క్రాప్ టాప్ వేసుకొని టిక్‌టాక్ వీడియో చేసింద‌నే కార‌ణంతో!

ఈ కేసులో యువకుడితో పాటు అతనికి ఆశ్రయం ఇస్తున్నట్లు అనుమానిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, 20 ఏళ్ల మారియా ఓ ఆధునిక యువ‌తి, సోషల్ మీడియాలో దుర్మార్గ‌పు ఆచారాల‌కు వ్య‌తిరేకంగా 'తిరుగుబాటు' ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. సిగరెట్ తాగడం, ఆమె అభిప్రాయాలను నిర్భ‌యంగా వ్యక్తం చేయడం, క్రాప్ టాప్స్, క్రుసిఫిక్స్ ధరించడం వంటి చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకించిన త‌న సోద‌రుడు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

Advertisement

Next Story

Most Viewed