- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal Thakur: న్యూ జర్నీ అంటూ పెళ్లి కూతురుగా మృణాల్ రాకూర్.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ రాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన క్రేజ్‌ను పెంచుకుంది. గత ఏడాది ‘హాయ్ నాన్న’(Hi Nanna) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది కానీ హిట్ అందుకోలేకపోయింది.
ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, మృణాల్ తనేరా యాడ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పెళ్లి కూతురు(Bride)లా రెడీ అయిన ఆమె గుమ్మం దాటుతూ కనిపించింది. ‘‘అందమైన ఆరంభం కొరకు. తన మొదటి ఇంటి గడప దాటిన ఆ క్షణం - నిన్నటి జ్ఞాపకాలను, రేపటి కలలను, తల్లి ఆశీర్వాదాన్ని మోసుకుంటూ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ మృణాల్ ఫొటోలు వైరల్ అవుతుండగా.. సడెన్‌గా చూసిన వారు పెళ్లి చేసుకోబోతుందా? అని షాక్ అయ్యారు. ఆ తర్వాత యాడ్ కోసం అని తెలుసుకుని యష్ణ మళ్లీ వచ్చేసిందని కామెంట్లు పెడుతున్నారు.