Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌ను ప్రభావితం చేసిన మైక్రోసాఫ్ట్ అంతరాయం

by Harish |
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌ను ప్రభావితం చేసిన మైక్రోసాఫ్ట్ అంతరాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిద దేశాల్లో చాలా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోగా, దీని ప్రభావం 2024 పారిస్ ఒలంపిక్స్‌పై కూడా పడింది. మరికొద్ది రోజుల్లో గేమ్‌ల ప్రారంభోత్సవం జరగనుంది. దీంతో నిర్వహకులు తమ కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒలంపిక్స్‌కు సంబంధించిన ఐటీ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, అకస్మాత్తగా కంప్యూటర్ సిస్టమ్‌లలో అంతరాయం రావడంతో పనులు స్తంభించిపోయాయని నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక బృందాలు తీవ్రంగా శ్రమించి ప్రస్తుతం ఈ సమస్య నుంచి వేగంగా బయట పడేశాయి.

పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీకి చెందిన అధికారి మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్‌‌లో అంతరాయం కారణంగా శుక్రవారం జరిగే వేడుకకు ముందు కొంతమంది వ్యక్తులు బ్యాడ్జ్‌లను తీసుకోలేకపోవడంతో అక్రిడిటేషన్ వ్యవస్థపై ప్రభావం చూపుతోందని అన్నారు. అలాగే, వేడుకను చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు పారిస్‌కు వస్తున్న సమయంలో విమాన సేవల్లో అంతరాయం వలన అథ్లెట్లు, ఇంకా పర్యాటకులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా ల్యాప్‌ట్యాప్‌/ పీసీ స్క్రీన్‌లపై బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపించి, వెంటనే సిస్టమ్‌ షట్‌డౌన్‌ గానీ, రీస్టార్ట్ అవుతోంది. దీంతో యునైటెడ్ స్టేట్స్‌లో విమాన సేవలు, UKలో టెలివిజన్ ప్రసారాలు, ఆస్ట్రేలియాలో టెలికమ్యూనికేషన్‌లు, బ్యాంకులు తదితర సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

Advertisement

Next Story