- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించిన FBI
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని ఎఫ్‌బీఐ గుర్తించింది. ఫైరింగ్ చేసిన షూటర్‌ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు. థామస్ మాథ్యూ క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్‌కు చెందిన వ్యక్తని వెల్లడించారు. ఏఆర్ 15 సెమీ ఆటోమేటిక్ గన్‌తో కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. క్రూక్స్ దగ్గర ఎలాంటి ఐటీ కార్డులు లేకపోవడంతో డీఎన్ఏ, బయోమెట్రిక్ ద్వారా నిందితుడి ఆధారాల నిర్ధారణకు అధికారులు యత్నిస్తున్నారు.
కాగా, ఆదివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో నిందితుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని స్పాట్‌లోనే కాల్చి చంపారు. తాజాగా నిందితుడిని థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. అమెరికా అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరగడంతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.