Indian Wild Dogs : అసిఫాబాద్ జిల్లాలో అరుదైన ఇండియన్ వెల్డ్ డాగ్స్

by Y. Venkata Narasimha Reddy |
Indian Wild Dogs : అసిఫాబాద్ జిల్లాలో అరుదైన ఇండియన్ వెల్డ్ డాగ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న అరుదైన ఇండియన్(Indian Wild Dogs) వైల్డ్ డాగ్స్(అడవి కుక్కలు) తెలంగాణలో కనిపించాయి. కొమురంభీమ్ ఆసిఫాబాద్(Asifabad District)జిల్లా పెంచికల్ పేట్ అడవుల్లో అరుదైన ఇండియన్(ఏసియన్) వైల్డ్ డాగ్స్ సంచారం కెమెరాలకు చిక్కాయి. ఓ నీటి కుంట వద్ద నీళ్ల కోసం వచ్చిన ఇండియ్ వైల్డ్ డాగ్స్ దృశ్యాల వీడియో వైరల్ గా మారింది. కమ్మర్గాం- మురళిగూడ మధ్య అటవీ ప్రాంతాంలోని చెరువ వద్ద మూడు ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్‌ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచికల్ పేట రేంజ్ పరిధిలో సుమారుగా ఐదు నుంచి పది ఏసియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైనా వైల్డ్ డాగ్స్ కి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు ఉంటాయంటూ అటవిశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో కృష్ణా తీరం నల్లమల, గోదావరి తీరం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆడవులు పెద్దపులులతో పాటు అరుదైన వన్య ప్రాణుల ఆవాసంగా మారి జీవ వైవిద్యానికి వేదికవ్వడం విశేషమంటున్నారు పర్యావరణ నిపుణులు. ఈ అరుదైన ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్‌ దేశంలోని పెంచ్ నేషనల్ పార్క్ , సత్పురా నేషనల్ పార్క్ మరియు సెంట్రల్ ఇండియాలోని తడోబా నేషనల్ పార్క్ , దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని బందీపూర్ , నాగర్‌హోల్ నేషనల్ పార్క్ లలో కనిపిస్తాయి. మధ్య భారతదేశం, పశ్చిమ, తూర్పు హిమాలయాలలో, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లలో కూడా వీటిని చూడవచ్చని తెలిపారు.

Advertisement

Next Story