Health tips: షుగర్ ఉన్న వారు ఖర్జూరం తినొచ్చా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-22 15:38:07.0  )
Health tips: షుగర్ ఉన్న వారు ఖర్జూరం తినొచ్చా..?
X

దిశ, ఫీచర్స్: షుగర్ ఉన్న వారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ కంట్రోల్ ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. అయితే, కొన్ని ఆహార పదార్థాల విషయంలో మాత్రం సందేహాలు వస్తుంటాయి. డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరం తినొచ్చా అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే వీటిలో షుగర్ అయిన ఫ్రక్టోస్ ఉంటుంది. అందుకే వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని అనుకుంటారు. ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది వీటిని ఇష్టంగా తింటుంటారు. అయితే, డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వీటిని మితంగా తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెడుతున్నారు. ఖర్జూరంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం, విటమిన్- ఎ, కె, బి-కాంప్లెక్స్‌లు అధికంగా ఉంటాయి.

మెగ్నీషియం, పొటాషియం వంటివి అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారు రోజుకు 2 లేదా మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్న వారు అతిగా తినడం మంచిది కాదు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్‌లు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఖర్జూరంలో కాల్షియంతో పాటుగా మినరల్స్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి.

ఖర్జూరంలోని పీచు మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరం అలసిపోతే వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు కలిసి కార్బోహైడ్రేట్స్‌ని ఏర్పరుస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణనే శక్తి లభిస్తుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Olive benefits : ఔషధ గుణాల ఆలివ్.. ఇది తెలిస్తే అస్సలు వదలరు!





Advertisement

Next Story

Most Viewed