ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ధర ఎంతో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2022-11-27 04:08:24.0  )
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఫిఫా వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ టీవీల ముందు అతుక్కుపోతుంటారు. తాజాగా ఈ నెల 20న ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న విజేత ఎవరో తెలియనుంది. అయితే తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీ ధర గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేస్తున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ధర తెలిస్తే షాకవడం ఖాయం. ఎందుకంటే ఆ ట్రోఫీ ధర అక్షరాల 144 కోట్ల రూపాయలు. ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీకి కూడా ఇంత భారీ ఎత్తున ధర ఉండదు. అసలు ఈ ట్రోఫీకి ఎందుకింత ధర అంటే.. ఈ ట్రోఫీని 6 కిలోల (24 క్యారెట్) బంగారంతో తయారు చేశారు. దీని పొడవు 14 సెంటిమీటర్లు. 1971 నుంచి ఈ ట్రోఫీని విజేతలుగా నిలిచిన వారికి ఇస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకి దక్కించుకోవడానికి ఈ సారి మొత్తం ౩౨ జట్లు పోటీ పడుతున్నాయి. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story