- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిపబ్లికన్ కన్వెన్షన్ ప్రారంభం..ట్రంపును అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించే చాన్స్
దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్(ఆర్ఎన్‌సీ) విస్కాన్సిన్‌లోని మివాకీలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హాజరయ్యారు. ట్రంపుపై హత్యాయత్నం జరగడంతో మీటింగ్ ప్రాంతంలో భారీగా భద్రతను మోహరించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ వన్స్ ఎగైన్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్‌లో ట్రంపును రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశాల చివరి రోజు గురువారం ఈ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని కూడా వెల్లడించనున్నారు. అయితే అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఖరారైనప్పటికీ.. ఉపాధ్యక్ష పదవికి రేసులో ఒహియో సేన్. జెడి వాన్స్, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్‌లతో సహా నలుగురు ప్రముఖ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గం కూడా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ( ఆర్ఎన్‌సీ) అనేది అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రోగ్రాం. దీని ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను ఎన్నుకుంటారు.