నోబెల్ అవార్డు గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష.. కారణమిదే!

by Sathputhe Rajesh |
నోబెల్ అవార్డు గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష.. కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: నోబెల్ అవార్డు గ్రహీతకు బెలారస్ ప్రభుత్వం పదేళ్ల జైలు శిక్ష విధించింది. బెలారస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను చేపట్టారనే అభియోగాలపై ఆయనకు ఈ శిక్ష విధించారు. ఈ కేసులో సహ నిందితులు వాలెంటిన్ స్టెఫానోవిచ్ కు తొమ్మిదేళ్ల జైలు, వ్లాదిమిర్ ల్యాబ్ కోవిచ్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 2022లో నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా గెలుచుకున్న వారిలో అలెస్ బియాలిస్కీ ఒకరుగా ఉన్నారు.

నోబెల్ అవార్డు గ్రహీతను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఇబ్బంది పెడుతున్నట్లు బియాలిస్కీ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో వివాదాస్పద 2020 ఎన్నికలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక ప్రదర్శనల తర్వాత బియాలిస్కి జైలు పాలయ్యారు. లుకషెంకో నాయకత్వాన్ని తిరస్కరిస్తూ 2021లో జరిగిన నిరసన ప్రదర్శనల సమయంలో అలెన్ బియాలిస్కిని అరెస్ట్ చేశారు. ఈ నిరసనల కోసం ప్రతిపక్షాలకు బియాలిస్కి నిధులను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed