TANA:తానా ఫౌండేషన్‌ సహాయం..బాలికలకు సైకిళ్ల పంపిణీ

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-29 20:31:16.0  )
TANA:తానా ఫౌండేషన్‌ సహాయం..బాలికలకు సైకిళ్ల పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్:ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం(Khammam)లోని శాంతి నగర్‌ ఉన్నత పాఠశాల(Shanti Nagar High School)లో ఆదరణ పథకం కింద బాలికలకు సైకిళ్లను(Bicycles) పంపిణీ చేశారు.తానా ఫౌండేషన్‌ ఛైర్మన్ శశికాంత్‌ వల్లేపల్లి(Shashikant Vallepally), కో-ఆర్డినేటర్‌ భక్త బల్లా(Bhakta Balla) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ..ఫౌండేషన్‌ తరపున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఆదరణ పథకం కింద ప్రస్తుతం 60మంది బాలికలకు సైకిళ్లను అందజేస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా కొన్ని స్కూళ్లలో బెంచీలు, కుర్చీలు వంటి సామాగ్రికి తీవ్ర నష్టం కలిగింది. వీటికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా యువ నాయకులు తుమ్మల యుగంధర్‌ సూచన చేయగా, వాటి మరమ్మతుల కోసం ఫౌండేషన్‌ తరపున 2 లక్షల రూపాయలను ఆయా స్కూళ్లకు విరాళంగా అందజేస్తున్నట్లు శశికాంత్‌ తెలిపారు. ఈ మేరకు 2లక్షల రూపాయల చెక్‌ను ఖమ్మం అర్బన్‌ విద్యాధికారి శ్రీ రాములు గారికి అందజేశారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డాన్‌ బస్కో అధ్యక్షత వహించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకులు తుమ్మల యుగంధర్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఖమ్మంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని పేర్కొన్నారు.ఈ మేరకు ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపును అభినందించారు. పాఠశాలకు విరాళం అందించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తానా ఫౌండేషన్‌ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీ కూరపాటి ప్రదీప్‌, ఎంఈవో శ్రీ రాములు,ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వర్‌ రావు, పసుమర్తి రంగారావు, శ్రీ గడ్డం వేంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు వాసిరెడ్డి శ్రీనివాస్‌ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.









Advertisement

Next Story

Most Viewed