చైనాకు షాక్.. తైవాన్‌ సబ్‌మెరైన్‌ రెడీ

by Vinod kumar |
చైనాకు షాక్.. తైవాన్‌ సబ్‌మెరైన్‌ రెడీ
X

బీజింగ్: చైనాకు తైవాన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన ఈ జలాంతర్గామిని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్‌ యింగ్‌ గురువారం ఆవిష్కరించారు. దాదాపు రూ.10వేల కోట్లతో నిర్మించిన ఈ డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గామిని 2024నాటికి ఓడరేవు పట్టణం ఖోషింగ్‌లో మోహరించనున్నారు. ఈ సబ్‌మెరైన్‌కు ‘హైకూ’ అని పేరుపెట్టారు. మరో జలాంతర్గామి కూడా నిర్మాణ దశలో ఉంది. మొత్తం 10 జలాంతర్గాములను నిర్మించాలని తైవాన్‌ లక్ష్యంగా పెట్టుకొంది. మరోవైపు తైవాన్‌ చుట్టుపక్క సముద్ర జలాల్లో చైనా యాంటీ సబ్‌మెరైన్‌ నెట్‌వర్క్‌ను మోహరిస్తోంది. చైనా వద్ద దాదాపు 60 సబ్‌మెరైన్లు ఉన్నాయి.

Advertisement

Next Story