జాబ్ నోటిఫికేషన్లపై సర్కార్ సంచలన నిర్ణయం

by M.Rajitha |   ( Updated:2024-10-09 11:09:38.0  )
జాబ్ నోటిఫికేషన్లపై సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కొత్త జాబ్ నోటిఫికేషన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఎస్సీ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. 24 గంటల్లో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, 60 రోజుల గడువులోపు కమిషన్ తన నివేదికను సమర్పించేలా చూడాలని అధికారాలకు సూచించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకొని కమిషన్ నివేదిక తయారు చేయాలని సీఎం కోరారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్ట్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ పలుమార్లు సమావేశమయింది. ఉత్తమ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్, సబ్ కేబినెట్ సభ్యులంతా సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed