Attacked On MLA: బీజేపీ ఎమ్మెల్యే చెంప వాయించిన లాయర్.. వీడియో వైరల్

by Prasad Jukanti |   ( Updated:2024-10-09 11:58:39.0  )
Attacked On MLA: బీజేపీ ఎమ్మెల్యే చెంప వాయించిన లాయర్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ లాయర్ బీజేపీ ఎమ్మెల్యేను చెంప దెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. లఖింపూర్ బార్ అసోసియేన్ ప్రెసిడెంట్ అవదేశ్ సింగ్ స్థానిక ఎమ్మెల్యే యోగేష్ వర్మపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడు. ఎదురుగా వెళ్లిన అవదేశ్ సింగ్ పోలీసులు అడ్డుకునే లోపే ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు సైతం ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలో జరగనున్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్ దాఖలు సందర్భంగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed