- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: నాగచైతన్య షాకింగ్ ట్వీట్.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇటీవల సమంత(Samantha)తో విడాకులు తీసుకోవడం గురించి మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన కామెంట్లపై చైతు రియాక్ట్ అయి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడప్పుడు పలు పోస్ట్‌లు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా, నాగచైతన్య ‘X’ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘నేను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్ల(Bit coin)ను 2013లో కొనుగోలు చేశాను. వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు ఉంది. వాటిని ఇప్పుడు బహుమతిగా ఇవ్వాలా వద్దా మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని తెలయజేయండి’’ అని రాసుకొచ్చారు.
అయితే నాగచైతన్య సడెన్‌గా హ్యాకర్లు పెట్టే పోస్ట్ పెట్టడంతో ట్విట్టర్ హ్యాక్(Twitter Hack) అయినట్లు నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చైతు ట్వీట్ డిలీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా, నాగచైతన్య ప్రజెంట్ చందూ మొండేటీ దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel Movie)మూవీ చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం తండేల్ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.