- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కందూర్ ప్రజలకు రుణపడి ఉంటా: డీకే అరుణ
దిశ,అడ్డాకుల : తనపై నమ్మకంతో ఎంపీగా తనను గెలిపించిన కందూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అడ్డాకుల మండలం కందూర్ గ్రామంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. బీజేపీ జెండాను ఎగురవేసి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు డిజిటల్ సభ్యత్వాలను అందజేశారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ..హర్యానా ఎన్నికల సర్వేలన్నీ తలకిందులు అయ్యాయని తప్పుడు ప్రచారం చేసిన పార్టీలకు ఇది ఒక గుణపాఠం అని అన్నారు. మునుపేన్నడు లేనన్ని సీట్లను బీజేపీ కైవసం చేసుకుందని,పండుగ వాతావరణం తెచ్చిందని ఆమె అన్నారు. బీజేపీ తెలంగాణలోను అధికారంలోకి రావాలన్నా,స్థానిక సంస్థల్లో గెలవాలన్నా సభ్యత్వాలు రెట్టింపు అవ్వడానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజ,అభిషేకం నిర్వహించారు. భక్తుల,ప్రముఖుల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రాజేశ్వర శర్మ వినతిపత్రం అందజేశారు.