- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఫ్గానిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి, 13 మందికి పైగా గాయాలు..!
దిశ,వెబ్‌డెస్క్: అఫ్గానిస్తాన్(Afghanistan) రాజధాని కాబూల్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 13 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాబూల్ యొక్క దక్షిణ శివార్లలోని ఖలా-ఎ-బక్తియార్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని కాబూల్ పోలీసు చీఫ్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని,బాంబు దాడికి బాధ్యుల ఎవరనేది త్వరలోనే గుర్తిస్తామని ఖలీద్ జద్రాన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో పోస్ట్ చేశాడు.
కాగా 2021లో అఫ్గానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా హింసత్మకమైన ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. అలాగే తాలిబన్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు, షియా ప్రాంతాలపై గతంలో అనేక దాడులు చేసింది.కాగా అఫ్గానిస్తాన్ లో చివరి ఆత్మాహుతి దాడి ఈ ఏడాది మార్చిలో కాందహార్ పట్టణంలో జరిగింది . ఈ దాడికి తామే పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.అయితే ఈ దాడిలో మగ్గురు మరణించారని తాలిబాన్ ప్రభుత్వం తెలపగా, 20 మందికి పైగా మరణించినట్లు స్థానిక ఆసుపత్రులు పేర్కొన్నాయి.