శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు

by Sathputhe Rajesh |
శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నారు. ఆర్థిక సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. రాజకీయ సుస్ధిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక ప్రభుత్వం అవసరమని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed