‘ప్రధాని మోడీ పర్యటన.. రాష్ట్ర ప్రగతికి సోపానం’.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ప్రధాని మోడీ పర్యటన.. రాష్ట్ర ప్రగతికి సోపానం’.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం మంచి ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ‘ప్రధాని మోడీ పర్యటన.. రాష్ట్ర ప్రగతికి సోపానం’ అని ఆమె పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ తొలిసారి విశాఖకు వస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) శ్రీకారం చుడతారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టాలనేది కేంద్రం యోచన మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రి ఆలోచిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ జీతాల విషయాన్ని కుమారస్వామి పరిశీలిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed