Uttam: సాగర్ డ్యామ్‌పై గుంటల పూడ్చివేతకు రంగం సిద్ధం.. సమీక్షలో మంత్రి ఉత్తమ్

by Ramesh Goud |   ( Updated:2025-01-07 12:35:43.0  )
Uttam: సాగర్ డ్యామ్‌పై గుంటల పూడ్చివేతకు రంగం సిద్ధం.. సమీక్షలో మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ డ్యామ్(Nagarjun Sagar Dam) మీద పడిన గుంటలను పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకంపై(Nellikallu Lift Irrigation) జలసౌధ(Jalasoudha)లో సమీక్ష నిర్వహించిన ఆయన.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సాగర్ గ్యామ్ పై గుంటలు పూడ్చివేతకు ఐఐటీ రూర్కీ(IT Rurki) ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే నెల్లికల్లు ఎత్తిపోతల పధకం ఫెజ్-1 పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికీ నీళ్లు అందించే విదంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని అందించే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రూ.664.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ఎత్తిపోతల పధకం పూర్తి అయితే 24,624 ఎకరాల ఆయకట్టును సేద్యంలోకి వస్తుందన్నారు.

ఖరీఫ్ సీజన్ నాటికి మొదటి దశ పూర్తి అయితే 7,600 ఎకరాలకు నీరందించవచ్చని తెలిపారు. అంతే గాక హైలెవల్, లోలెవల్ కెనాల్ ల మధ్యలో చేపట్టిన లింక్ కెనాల్ పనులను వేగిరపరచాలన్నారు. 15 కిలోమీటర్ల పరిధిలో 62.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కాలువ నిర్మాణం కోసం కావలసిన 65.02 ఎకరాలకు గాను ఇప్పటికే 43.31 ఎకరాల భూమిని సేకరించారని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. చివరి భూములకు నీరు అందేలా ఏయంఆర్(AMR), ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రాజెక్ట్ ల పరిధిలోని 90.43 కిలోమీటర్ల మేర కాలువలను 42.26 కోట్ల వ్యయంతో 60 మిల్లీమీటర్ల మేర కాంక్రీట్ లైనింగ్ తో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక సాగర్ ఆయకట్టు పరిధిలోని 39 ఐడీసీ ఎత్తిపోతల పధకాలలో ఎక్కువ భాగం పనిచేయడం లేదని, పనిచేయని వాటిని గుర్తించి మరమ్మతులకు అయ్యే వ్యయం తాలూకు అంచనాలు రూపొందించిన సత్వరమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అనుమల చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed