- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ హోటళ్లు, రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టేది లేదు: ఫుడ్ సేఫ్టీ అధికారులు
దిశ, తిరుపతి: తిరుపతి నగర పరిధిలో గల హోటళ్ళు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు చెందిన వారు జట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో గల హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా తిరుచానూరు సమీపంలో గల పీఎస్1 పద్మావతి శ్రీనివాసా హోటల్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుగొలిపే నిజాలు బయటపడడంతో వారు నిర్ఘాంతపోయారు. హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దాడులను జట్లుగా ఏర్పడి దాదాపు పది చోట్ల నిర్వహించామని అన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లను రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారని అటువంటి వారిని మన అతిధులుగా భావించి నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి హోటల్ వ్యాపారిపై ఉందని అన్నారు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే గాక సమీప రాష్ట్రాలు నుంచి కూడా ఫిర్యాదులు అందుతుండడంతో ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైడ్ చేసిన పీఎస్ వన్ పద్మావతి శ్రీనివాస హోటల్ శాంపిళ్లను తీసుకున్నామని అన్నారు. ఈ శాంపిళ్లను హైదరాబాద్ కి పంపించి అక్కడి నుంచి వచ్చిన రిపోర్టులు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు