చెరువులో పడి వ్యక్తి మృతి

by Naveena |
చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ, మక్తల్: బహిర్భూమికని వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో పోర్ల నరసింహ (30) చనిపోయిన సంఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉర్సు ఉత్సవాల్లోరాత్రంతా జల్సా చేసుకున్న వ్యక్తి తేల్లారితే కనబడక పోవడంతో..ఎక్కడికి వెళ్లాడని భార్య ,కుటుంబికులు వెతగా గ్రామం దగ్గర ఉన్న చెరువులో మొరం గుంతలో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..ఉట్కూరు మండలం బిజ్వర్ గ్రామానికి చెందిన పోర్లనర్సింలు భార్య పుట్టినిల్లు అయిన దాసర్పల్లి గ్రామంలో జరిగే ఊర్సుకు వచ్చి జల్సా చేసుకున్న వ్యక్తి మధ్యరాత్రిలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తెల్లారితే కనబడక పోవడంతో..అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతకగా చెరువు గట్టుపై చెప్పులు ఉండడంతో అనుమానం వచ్చి చెరువులో గాలించారు. నీటిలో మునిగి చనిపోగా శవాన్ని ఒడ్డు చేర్చారు. విషయాన్ని మక్తల్ పోలీసులుకు సమాచారం ఇచ్చారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed