- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలి
దిశ, సుల్తానాబాద్ : లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 45 రోజులపాటు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన తన సొంత ఖర్చులతో నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుండి ఉదయం పూట కాలేజీకి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కష్టంగా మారిందని అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇందుకు తానుఈ కార్యక్రమాన్ని చేపట్టానని వివరించారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వమే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. సుల్తానాబాద్ కాలేజీ అభివృద్ధిలో భాగంగా హైస్కూల్ విభాగంకు నూతన భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఎంసెట్, నీట్ పరీక్షలకు సన్నద్ధం అయ్యే స్టూడెంట్స్ కు అవసరమైన పుస్తకాలను అందిస్తానని తెలిపారు. కాలేజీ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర అన్ని రంగాల్లో రాణించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.