Road Show: హలో విశాఖ.. బాగున్నారా...!

by srinivas |   ( Updated:2025-01-08 11:49:57.0  )
Road Show: హలో విశాఖ.. బాగున్నారా...!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ప్రధాని మోడీ(Pm Modi) రోడ్ షో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఇందులో భాగంగా విశాఖ(Visakha) నగరంలో రోడ్ షో నిర్వహించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించి తద్వారా ప్రజలకు ఆయనకు అభివాదం చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ప్రధాని మోడీ.. రోడ్ షో అనంతరం వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, తిరుపతి జిల్లా చైన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల లో భాగమైన కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed